'స్వాతిముత్యం' నుంచి మరో అప్ డేట్ రెడీ!

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'స్వాతిముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ కి ఇది మొదటి సినిమా 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • ఆగస్టు 13వ తేదీన సినిమా రిలీజ్
Swathi Muthyam Movie Update

బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేశ్ హీరోగా ప్రేక్షకులను పలకరించే సమయం దగ్గరలోనే ఉంది. శ్రీనివాస్ పూర్తి మాస్ కంటెంట్ తో తెలుగు తెరకి పరిచయమైతే, ఆయన సోదరుడు గణేశ్  మాత్రం 'స్వాతిముత్యం' వంటి సాఫ్ట్ కేరక్టర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో ఆయనకు జోడీ. 

వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన కట్టిన బాణీల్లో నుంచి ఫస్టు సింగిల్ ప్రోమోను వదలడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఫస్టు సింగిల్ ప్రోమోను రేపు ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ను వదిలారు.

'నీ చారెడు కళ్లే .. ' అంటూ ఈ సాంగ్ సాగనుంది. ఇది నాయకా నాయికలపై చిత్రీకరించిన డ్యూయెట్ అనే విషయం పోస్టర్ ను బట్టే అర్థమైపోతోంది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఆగస్టు 13వ  తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. మొదటి సినిమాతో బెల్లంకొండ గణేశ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో .. ఎన్నేసి మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి..

More Telugu News