రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ పై ఆమె ప్రియుడి స్పందన!

24-06-2022 Fri 17:33
  • 'పసూరి' సాంగ్ కు డ్యాన్స్ చేసిన రకుల్
  • యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్
  • నాక్కూడా నేర్పించవా అంటూ రకుల్ ప్రియుడి కామెంట్
Rakul Preet Singh lovers response on her dance
దక్షిణాదిన ఎంతో క్రేజ్ ఉన్న సినీ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉంటూనే... బాలీవుడ్ లో సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తాజాగా సెలబ్రిటీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద ఆమె శిక్షణ తీసుకున్నారు. 'పసూరి' సాంగ్ కు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది.

 ఇప్పుడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ గా  మారింది. షేర్ చేసి గంటలోనే 3 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. మరోవైపు రకుల్ వీడియోపై ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ స్పందించాడు. 'మై డియర్ లవ్.. నాక్కూడా నేర్పించవా?' అంటూ కామెంట్ పెట్టాడు.