భారతదేశ తొలి సూపర్ ఉమన్ మూవీ 'ఇంద్రాణి'... శరవేగంగా షూటింగ్

24-06-2022 Fri 17:05
  • గరిమ కౌశల్ ప్రధానపాత్రలో ఇంద్రాణి
  • స్టీఫెన్ దర్శకత్వం.. సాయికార్తీక్ సంగీతం
  • అక్టోబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్
Shooting speeds up for Indrani movie
దేశంలో మొట్టమొదటి సూపర్ ఉమన్ మూవీగా తెరకెక్కతున్న చిత్రం ఇంద్రాణి. సైన్స్ ఫిక్షన్, కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డ్రామా, డ్యాన్స్ నంబర్‌ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని స‌మ‌పాళ్ల‌లో కూడిన మొట్ట‌మొద‌టి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా  ఇంద్రాణి చిత్రం నిలవనుంది. ఇందులో గరిమ కౌశల్ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి గరిమ కౌశల్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 

ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబరు 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. శ్రే మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం మాత్రమే కాదు, నిర్మాత కూడా ఆయనే. 

ఇంద్రాణి చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహ‌న్‌ సింగ్, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్ర మేకింగ్ వీడియోను చిత్రబృందం పంచుకుంది.