వైసీపీని వీడి టీడీపీలో చేరిన రుద్రరాజు వెంక‌ట్రామ‌రాజు

24-06-2022 Fri 17:05
  • రాజోలు నియోజకవ‌ర్గానికి చెందిన రుద్ర‌రాజు
  • వంద‌లాది మంది అనుచ‌రుల‌తో టీడీపీలో చేరిన రుద్రరాజు
  • సాద‌రంగా ఆహ్వానించిన‌ చంద్ర‌బాబు
rudraraju joined in tdp
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి, ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి ఇటీవ‌లే రాజీనామా చేసిన రుద్ర‌రాజు వెంక‌ట్రామ‌రాజు తాజాగా శుక్ర‌వారం విప‌క్ష టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స్వ‌యంగా రుద్ర‌రాజుకు పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయనతో పాటు వంద‌లాది మంది అనుచ‌రులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌కవ‌ర్గం సఖినేటిపల్లి మండలం గుడిమూలకు చెందిన రుద్ర‌రాజు గ‌త ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థి కోసం కృషి చేశారు. అయినా కూడా త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్న ఆవేద‌న‌తో ఆయ‌న వైసీపీని వీడారు.