Chiranjeevi: బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు.. సంక్రాంతికి కలుద్దాం అంటున్న చిరంజీవి!

Megastar Chiru154 movie Worldwide Release in Cinemas this Sankranthi 2023
  • బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త సినిమా
  • వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాణ సంస్థ
  • చిరు సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్
మెగాస్టార్ చిరంజీవి.. యువ దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర)తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ ను యూనిట్ శుక్రవారం ప్రకటించింది. చిరు చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. 

‘బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు’ అంటూ... మెగాస్టార్ 154వ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతికి విడుదల అవుతుందని ట్విట్టర్ లో ప్రకటించింది. వర్షంలో చిరు లంగరు పట్టుకున్న పోస్టర్ ను ఈ సందర్భంగా  షేర్ చేసింది. 'కలుద్దాం సంక్రాంతికి..' అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. చిత్రం అధికారిక టైటిల్, టీజర్ ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. 

ఈ సినిమాను మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. చిరు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఇటీవలే విడుదలై నిరాశ పరిచింది. ప్రస్తుతం మెగాస్టార్..‘లూసిఫర్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు రవితేజ సరసన ‘క్రాక్’తో సూపర్ హిట్ అందుకున్న శ్రుతి హాసన్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రభాస్ 'సలార్' సినిమాలో నటిస్తున్న ఆమె.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణకు జోడీగానూ చేస్తోంది.
Chiranjeevi
Tollywood
director boby
new movie
DSP
Shruti Haasan
SANKRANTI 2023

More Telugu News