జ‌న‌సేన‌లో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వ‌ర‌ప్ర‌సాద్‌

23-06-2022 Thu 21:06
  • రాజోలుకు చెందిన వ‌ర‌ప్ర‌సాద్‌
  • 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా ప‌నిచేసిన వైనం
  • హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేనలో చేరిక‌
retired ias officer deva vara prasad joined janasena
ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న వేళ జ‌న‌సేన స్పీడును పెంచేస్తున్న‌ట్లుగా ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన స్పీడుకు అనుగుణంగానే ఆ పార్టీలోకి కొత్త‌గా చేరిక‌లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ కేడ‌ర్‌లో ఐఏఎస్ అధికారిగా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన దేవ వ‌ర‌ప్ర‌సాద్ నేడు జ‌న‌సేన‌లో చేరిపోయారు.

హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలోనే వరప్ర‌సాద్ జ‌న‌సేనలో చేరారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం దిండి గ్రామానికి చెందిన వ‌ర‌ప్ర‌సాద్ ఏపీ ప్ర‌భుత్వంలో ప‌లు హోదాల్లో 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవ‌లు అందించారు.