Andhra Pradesh: ఆర్థిక ఇబ్బందులతోనే దుల్హన్ పథకాన్ని నిలిపేశాం: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం

  • ముస్లిం యువతుల పెళ్లి కోసం దుల్హన్ పథకం
  • టీడీపీ హయాంలో రూ. 50 వేలు ఇచ్చిన వైనం
  • ఇప్పుడు పథకాన్ని అమలు చేయడం లేదని పిటిషన్
Dulhan Scheme is stopped AP govt tells High Court

దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు చెప్పింది. ముస్లిం యువతుల వివాహం కోసం గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ముస్లిం యువతుల వివాహం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. 50 వేలు ఇచ్చేది. 

ఈ పథకం కింద రూ. 50 వేల సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, అయితే, ఆ హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. 

పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ... పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని కోర్టుకు తెలిపారు. దీంతో, రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News