Singareni Collieries Company: సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్​.. ఎవరెవరు అర్హులంటే..!

singareni releases recruitment for 177 junior assistant vacancies
  • 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ 
  • దరఖాస్తులకు జులై 10వ తేదీ ఆఖరు
  • రాత పరీక్ష ద్వారా ఎంపిక
సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్2 పోస్టులను భర్తీ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ చేసినవారు అర్హులు. డిగ్రీలో కంప్యూటర్స్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదంటే డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు/ డిప్లొమా చేయాలి.  

అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు.  ఈ ఉద్యోగాలను ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 29, 460 పే స్కేల్ తో వేతనం లభిస్తుంది. జనరల్ రూ. 400, ఎస్సీ, ఎస్టీ, సింగరేణి ఉద్యోగుల పిల్లలు రూ. 100తో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు సింగరేణి వెబ్సైట్ https://scclmines.com/ చూడవచ్చు.
Singareni Collieries Company

More Telugu News