Rupert Murdoch: మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ నాలుగో పెళ్లి పెటాకులు!

media baron Rupert Murdoch headed for 4th divorce
  • జెర్రీ హాల్ నుంచి విడిపోనున్నట్టు న్యూాయార్క్ టైమ్స్ కథనం
  • అధికారికంగా స్పందించని ముర్దోక్, హాల్
  • ఆరేళ్ల తర్వాత వేరు దిశగా అడుగులు
 అమెరికాకు చెందిన మీడియా దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ నాలుగోసారి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు. 91 ఏళ్ల వయసులో నాలుగో భార్య, నటి జెర్రీ హాల్ ను కూడా ఆయన విడిచిపెట్టనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.  

 ఫాక్స్ కార్ప్ చైర్మన్ అయిన మర్డోక్ 2016 మార్చిలో సెంట్రల్ లండన్ లో జరిగిన వేడుకలో జెర్రీ హాల్ ను వివాహం చేసుకున్నారు. ఫాక్స్ న్యూస్ ఛానల్, న్యూస్ కార్ప్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవన్నీ మర్డోక్ కు చెందిన వార్తా సంస్థలు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ లో కుటుంబ ట్రస్ట్ ద్వారా మర్డోక్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు. 

విడాకుల కథనంపై ఇటు మర్డోక్ అధికార ప్రతినిధి కానీ, అటు 65 ఏళ్ల హాల్ ప్రతినిధి కానీ స్పందించలేదు. మర్డోక్, హాల్ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారే. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మర్డోక్ నెట్ వర్త్ 17.7 బిలియన్ డాలర్లు. సుమారు రూ.1.80 లక్షల కోట్లు. మర్దోక్ లోగడ మూడు వివాహాలు చేసుకోగా.. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు.
Rupert Murdoch
media baron
4th divorce

More Telugu News