Gali janardhan Reddy: నేను అనుకుంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతాను: గాలి జనార్దన్‌రెడ్డి

Can become CM  have got enough money says Janardhan Reddy
  • సోమశేఖరరెడ్డి జన్మదిన వేడుకలకు హాజరైన జనార్దన్‌రెడ్డి
  • రెడ్డి బ్రదర్స్‌కు డబ్బుపై ఆశ లేదని వ్యాఖ్య
  • తనకు వ్యతిరేకంగా కొందరు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సీబీఐ తనతో చెప్పిందన్న మాజీ మంత్రి

తనకు ఎమ్మెల్యే అవాలని కానీ, మంత్రి అవాలని కానీ ఆశలు లేవని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. అయితే, తాను కనుక మనసు పెడితే మాత్రం ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మొన్న తన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి 57వ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.

బళ్లారిలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రెడ్డి బ్రదర్స్‌కు, శ్రీరాములకు డబ్బుపై ఆశ లేదన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా లేదని స్పష్టం చేశారు. తనకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సీబీఐ అధికారులు స్వయంగా తనతో చెప్పినట్టు జనార్దన్‌రెడ్డి తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే కార్యకర్తలు ఆయనపై పూలవాన కురిపించారు.

  • Loading...

More Telugu News