YSRCP: ఏపీ మాజీ మంత్రి అవంతికి క‌రోనా పాజిటివ్‌

ap ex minister avanthi srinivas tests positive for corona
  • భీమిలి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న అవంతి
  • ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన మాజీ మంత్రి
  • హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌
  ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ప్ర‌స్తుతం ఆయన త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. 

2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి వైసీపీ టికెట్‌పై భీమిలి నుంచి పోటీకి దిగి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఏపీలో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అవంతికి అవ‌కాశం దక్కింది. ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో అవంతి మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.
YSRCP
Avanthi Srinivas
Bheemili MLA
Corona Virus

More Telugu News