Narendra Modi: ఈ నెల 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi will visit Germany and UAE this month
  • జర్మనీలో జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం
  • ప్రధాని మోదీని ఆహ్వానించిన జర్మనీ చాన్సలర్
  • వివిధ అంశాలపై ప్రసంగించనున్న మోదీ
  • జర్మనీ పర్యటన అనంతరం యూఏఈ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ యాత్రకు వెళ్లనున్నారు. మోదీ ఈ నెల 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటించనున్నారు. స్క్లోస్ ఎల్మావులో జరిగే జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి రావాలంటూ జర్మనీ చాన్సల్ ఓలాఫ్ షోల్జ్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ జీ7 సదస్సులో ప్రధాని మోదీ రెండు సెషన్లకు హాజరవుతారు. పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్యం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రసంగించనున్నారు. 

కాగా, జర్మనీ పర్యటన అనంతరం ఈ నెల 28న ప్రధాని మోదీ యూఏఈ వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ మృతి పట్ల మోదీ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేయనున్నారు.
Narendra Modi
Gernany
G7 Summit
UAE

More Telugu News