Evtric Rise: ‘ఈవీట్రిక్ రైజ్’ ఎలక్ట్రిక్ బైక్.. 110 కిలోమీటర్ల రేంజ్

Evtric Rise electric motorcycle with 110 km range launched
  • మార్కెట్లోకి విడుదల చేసిన పూణె సంస్థ
  • చార్జింగ్ అయిన వెంటనే ఆటో కటాఫ్ ఫీచర్
  • ఎక్స్ షోరూమ్ ధర రూ.1,60,000
పూణెకు చెందిన ఈవీట్రిక్ మోటార్స్.. ఈవీ ట్రిక్ రైజ్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. ఒక్కసారి చార్జింగ్ తో 110 కిలోమీటర్లు ప్రయాణించే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,60,000. ఈ బైక్ బుకింగ్ లను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడం తెలిసిందే. మార్కెట్లో ఎక్కువగా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, బైక్ లు తక్కువే. ఈ క్రమంలో ఈవీ ట్రిక్ మోటార్స్ కమ్యూటింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈవీ బైక్ ను తీసుకొచ్చింది. 

2,000 వాట్ బీఎల్డీసీ మోటార్ 70వోల్ట్స్/40యాంపీ హవర్స్ లిథియం అయాన్ బ్యాటరీతో ఈ బైక్ పనిచేస్తుంది. నాలుగు గంటల్లో నూరు శాతం చార్జ్ అవుతుంది. బైక్ తో పాటు వచ్చే మైక్రో చార్జర్.. చార్జింగ్ పూర్తయిన వెంటనే ఆటో కటాఫ్ ఫీచర్ తో ఉంటుంది. 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
Evtric Rise
electric motorcycle
launched

More Telugu News