మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
- ఒడిశాలో భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి
- ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతుండగా కాల్పులు
- అదనపు బలగాలను తరలించిన అధికారులు
- నక్సల్స్ కోసం కూంబింగ్
ఈ కాల్పుల ఘటనతో పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒడిశాలో స్తబ్దుగా ఉన్న నక్సల్స్ ఉనికి చాటుకోవడం కోసమే ఈ దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో మావోలు భారీ ఆయుధ సంపత్తిని వినియోగించినట్టు కాల్పులు జరిగిన స్థలంలో లభ్యమైన ఆధారాలు చెబుతున్నాయి.