Elon Musk: లింగమార్పిడి చేయించుకున్న ఎలాన్ మస్క్ కుమారుడు.. పేరు మార్పు కోసం యత్నాలు!

Elon Musk transgender daughter trying to change her name
  • ఇప్పటికే 'ఆమె'గా మారిన జేవియర్ అలెగ్జాండర్
  • వివియన్ జెన్నా విల్సన్ గా పేరు మార్చుకున్న వైనం
  • ట్రాన్స్ జెండర్ కుమార్తె గురించి ఇంతవరకు స్పందించని మస్క్
ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కుమారుడు ఇప్పటికే లింగ మార్పిడి చేయించుకుని 'ఆమె'గా మారారు. ఇప్పుడు పేరును మార్చుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాన్ మస్క్ 2008లో మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో అలెగ్జాండర్ ఇటీవలే అమ్మాయిగా మారారు. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు. అమ్మాయిగా మారిన తర్వాత తన పేరును వివియన్ జెన్నా విల్సన్ గా మార్చుకున్నారు. ఇప్పుడు తన కొత్త పేరుతో పాటు, లింగమార్పిడిని గుర్తిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని కోరుతూ లాస్ ఏంజెలెస్ కౌంటీ సుపీరియర్ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన ట్రాన్స్ జెండర్ కుమార్తె గురించి ఇంత వరకు ఎలాన్ మస్క్ స్పందించలేదు.
Elon Musk
Son
Transgender

More Telugu News