Dmitry Muratov: ఉక్రెయిన్ చిన్నారుల కోసం తన నోబెల్ బహుమతిని వేలానికి ఇచ్చేసిన రష్యా పాత్రికేయుడు

  • గతేడాది నోబెల్ గెలుచుకున్న దిమిత్రి మురతోవ్
  • నొవయా గెజెటా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న మురతోవ్
  • రష్యా దాడుల్లో శరణార్థులుగా మారిన ఉక్రెయిన్ చిన్నారులు
  • చలించిపోయిన మురతోవ్
Russian journo Dmitry Muratov gave away his Nobel Peace Prize to auction

రష్యన్ పత్రిక నొవయా గెజెటా ఎడిటర్ ఇన్ చీఫ్ దిమిత్రి మురతోవ్ నోబెల్ బహుమతి విజేత. ఆయనకు 2021లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. సొంతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ ఇచ్చారు. 

అయితే, గత కొన్నినెలలుగా రష్యా జరుపుతున్న దాడుల్లో వందలాది మంది ఉక్రెయిన్ చిన్నారులు శరణార్థులుగా మారి పొరుగుదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి పట్ల నోబెల్ విజేత దిమిత్రి మురతోవ్ చలించిపోయారు. ఆ బాలలకు సాయం చేసేందుకు గాను, తన నోబెల్ బహుమతిని వేలం వేసేందుకు ఇచ్చేశారు. 

ఇప్పుడా నోబెల్ పీస్ ప్రైజ్ కు వేలంలో రూ.807 కోట్ల ధర పలికింది. అమెరికా సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ఈ నోబెల్ శాంతి బహుమతిని వేలం వేసింది. ఈ నోబెల్ అవార్డును వేలంలో దక్కించుకుంది ఎవరో మాత్రం హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ వెల్లడించలేదు. వచ్చిన నిధులను ఉక్రెయిన్ బాల శరణార్థుల కోసం వినియోగించనున్నారు.

More Telugu News