సీఎం యోగిని కలిసిన 'మేజర్' టీమ్

21-06-2022 Tue 14:29 | Entertainment
  • మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మేజర్'
  • అడివి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్
  • సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన యోగి
Major movie unit meets Yogi Adityanath
అడివి శేష్ తాజా చిత్రం 'మేజర్' ఘన విజయం సాధించింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులు, ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అందరి ప్రశంసలను అందుకుంటోంది.    

తాజాగా మేజర్ చిత్ర యూనిట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుంది. టీమ్ సభ్యులతో పాటు ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. యోగి కోసం వీరు ప్రత్యేక షో వేశారు. సినిమాను చూస్తూ యోగి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరినీ యోగి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాను చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉన్నికృష్ణన్ వారసత్వాన్ని యూపీ యువతలోకి తీసుకెళ్తామని చెప్పారు.