ఈ అస్సాం టీ ఖరీదు కిలో రూ.లక్ష
- ప్రయోగాత్మకంగా పభోజన్ తేయాకు సాగు
- నాణ్యమైన ప్రీమియం తేయాకు ఇది
- కిలోకు రూ.లక్ష పెట్టి కొన్న అసోం కంపెనీ
పభోజన్ టీ పొడితో తయారయ్యే టీ పసుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటుంది. కోసిన తర్వాత తేయాకు సహజసిద్ధంగా బంగారు వర్ణంలోకి మారిపోయి, టీకి మంచి రంగునిస్తుంది. అసోంకు చెందిన అత్యంత నాణ్యమైన టీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అందించడానికి వీలుంటుందని ఎసాహ్ టీ సీఈవో బిజిత్ శర్మ తెలిపారు.
పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ యజమాని రాఖీదత్తా మాట్లాడుతూ.. తాము కేవలం ఒక కిలో మాత్రమే పండించినట్టు చెప్పారు. రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రీమియం క్వాలిటీ టీకి డిమాండ్ ఉండడంతో ఈ రకాన్ని మొదటిసారి పండించారు.