మళ్లీ యాక్షన్ మొదలెడుతున్న 'భోళా శంకర్'

  • 'భోళా శంకర్' గా చిరంజీవి 
  • తాజా షెడ్యూల్ ఈ రోజునే మొదలు 
  •  రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ 
  • వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్  
Bhola Shankar movie update

చిరంజీవి కథానాయకుడిగా 'భోళా శంకర్' సినిమా రూపొందుతోంది. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఇంతవరకూ 40 శాతం చిత్రీకరణ జరిపారు.
 
తాజా షెడ్యూల్ ను ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నారు. ఈ షెడ్యూల్ ను కూడా యాక్షన్స్ సీన్స్ తోనే మొదలుపెడుతున్నారు. చిరంజీవి తదితరులపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్ చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమా హైలైట్స్ లో ఈ ఫైట్ ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. 

తమిళంలో ఆ మధ్య భారీ విజయాన్ని నమోదు చేసిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆయన సరసన నాయికగా తమన్నా అందాల సందడి చేయనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News