Deepika Padukone: హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన దీపికా పదుకొణె

Deepika Padukone returns from Hyderabad seen at airport in orange look with sunglasses
  • 'ప్రాజక్ట్ కె' సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్లిన బాలీవుడ్ భామ
  • ముంబై విమానాశ్రయం వెలుపల దర్శనం
  • ఆరెంజ్ సూట్ లో తళుక్కుమన్న దీపిక 
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకుని సోమవారం ముంబై వెళ్లిపోయింది. ప్రాజక్ట్ కె సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె చాలా రోజులుగా హైదరాబాద్ లోనే ఉండిపోయింది. ప్రభాస్, అమితాబ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తుండడం తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్ తర్వాత దీపిక 'కె' ప్రాజెక్టు షూటింగ్ తో బిజీగా ఉండిపోయింది. కేన్స్ ఫెస్టివల్ కోసం వెళ్లినప్పుడే ఆమె కరోనా బారినపడినట్టు సమాచారం.

హైదరాబాద్ లో షూటింగ్ సందర్భంగా కరోనా అనంతరం సమస్యల కారణంగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యింది. అనంతరం షూటింగ్ లో పాల్గొంది. ఎట్టకేలకు ఆమె ముంబై చేరుకుంది. ఆరెంజ్ రంగు షర్ట్, ఆరెంజ్ ప్యాంట్, కళ్లకు పెద్ద సైజు నల్లద్దాలతో ముంబై విమానాశ్రయం వెలుపల దర్శనం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించి లేదు. తన కోసం వచ్చిన కారు ఎక్కేసి ఇంటికి వెళ్లిపోయింది.
Deepika Padukone
leaves hyderabad
mumbai airport
project K

More Telugu News