Junior NTR: ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ ఖరారైనట్టే!

Janvi Kapoor In Prashanth Neel Movie
  • యూత్ లో జాన్వీకి మంచి క్రేజ్ 
  • బాలీవుడ్ లో భారీ హిట్ కోసం వెయిటింగ్
  • టాలీవుడ్ నుంచి వెళుతున్న అవకాశాలు 
  • ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ కాంబోకి గ్రీన్ సిగ్నల్  
బాలీవుడ్ లో భారీ హిట్స్ లేకపోయినా యూత్ లో జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ టాలీవుడ్ కి ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సుందరిని ఎన్టీఆర్ సినిమా కోసం ఒప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే అది కొరటాల సినిమా కాదు .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు.

ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాలతో చేయనున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకుందామని చూశారుగానీ కుదరలేదు. ఎన్టీఆర్ 31వ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొణెను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటం వలన, జాన్వీని సంప్రదించడం .. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. నవంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.
Junior NTR
Janvi Kapoor
Prashanth Neel Movie

More Telugu News