Fareed: టీవీఎస్ ఎక్స్ఎల్ కనిపిస్తే చాలు... ఎత్తుకుపోతాడు!

Police arrests vegetable vendor who has stolen only TVS XL mopeds
  • కూరగాయల వ్యాపారి దొంగగా మారిన వైనం
  • మోపెడ్ కొనేందుకు డబ్బు లేక చోరీల బాట
  • రెండేళ్లలో 23 మోపెడ్ల చోరీ
  • అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
మనుషుల్లో భిన్నరకాల మనస్తత్వాలు కలిగినవాళ్లు ఉంటారు. తమకు దక్కనిదాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. హైదరాబాద్ మల్లాపూర్ కు చెందిన 40 ఏళ్ల ఫరీద్ కూడా అలాంటివాడే. ఫరీద్ మొదట్లో ఓ కూరగాయల వ్యాపారి. సైకిల్ పై గల్లీ గల్లీ తిరుగుతూ కూరగాయలు విక్రయించేవాడు. 

ఇతర వ్యాపారులు టీవీఎస్ ఎక్స్ఎల్ పై తిరుగుతూ అమ్మకాలు సాగిస్తుండడాన్ని గమనించిన ఫరీద్, తాను కూడా ఎక్స్ఎల్ వాహనం కొనాలని భావించాడు. అయితే, తన వద్ద ఉన్న డబ్బు అందుకు సరిపోదని భావించి, చోరీల బాటపట్టాడు. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కనిపిస్తే చాలు... ఎత్తుకుపోవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా 24 నెలల వ్యవధిలో 23 మోపెడ్లు చోరీ చేశాడు. ఒక మోపెడ్ చోరీచేసిన తర్వాత దానిపై కొన్నాళ్లపాటు కూరగాయలు విక్రయించి తన మోజు తీర్చుకునేవాడు. ఆపై రూ.10 వేలకు దాన్ని అమ్మేసి, మరో మోపెడ్ చోరీచేసేవాడు.

 అయితే, కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్లే మాయం అవుతుండడాన్ని గమనించిన పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించి ఫరీద్ ను పట్టుకున్నారు. ఫరీద్ ను ప్రస్తుతం రిమాండ్ కు తరలించారు. తనకు గేర్లు ఉండే ఇతర బైకులు నడపడం రాదని, అందుకే టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్లనే చోరీకి ఎంచుకున్నానని ఫరీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
Fareed
TVS XL
Vegetabla Vendor
Mallapur
Hyderabad
Police

More Telugu News