న‌ర్సీప‌ట్నంలో దీక్ష విర‌మించిన‌ అయ్య‌న్న కుమారుడు విజ‌య్

  • న‌ర్సీప‌ట్నంలో అయ్య‌న్న ఇంటి ప్ర‌హ‌రీని కూల్చేసిన అధికారులు
  • కూల్చివేత‌కు నిర‌స‌న‌గా విజ‌య్ దీక్ష‌
  • నిమ్మ‌రసం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేసిన అనిత‌
tdp State General Secretary Vijay chintakayala deeksha concludes

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి ఇంటి ప్ర‌హ‌రీని అధికారులు కూల్చివేసిన వైనానికి నిర‌స‌న‌గా ఆయ‌న కుమారుడు, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ చేప‌ట్టిన దీక్ష సోమ‌వారం సాయంత్రం ముగిసింది. టీడీపీ మ‌హిళా విభాగం తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత నిమ్మ‌రసం ఇచ్చి విజ‌య్ దీక్ష‌ను విర‌మింప‌జేశారు.

రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే అయ్య‌న్న ఇంటి ప్ర‌హ‌రీని వైసీపీ స‌ర్కారు కూల్చివేసింద‌ని టీడీపీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కూల్చివేతకు నిర‌స‌న‌గా విజ‌య్ సోమ‌వారం ఉద‌యం త‌న ఇంటిలోనే దీక్ష‌కు దిగిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News