ఉజ్జయిన్ జైల్లో ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ
- జైల్లో ఖైదీల పరివర్తనకు అనేక ప్రయత్నాలు
- తాజాగా పౌరోహిత్యం కోర్సు
- 30 రోజుల పాటు శిక్షణ
- ఉత్తీర్ణులకు సర్టిఫికెట్ల ప్రదానం
విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి గాయత్రి మంత్ర గ్రంథం, సర్టిఫికెట్ అందజేస్తారు. ఆలయాల్లో అర్చకత్వంతో పాటు హోమాలు, యజ్ఞయాగాదులు చేయడంలో వీరికి తర్ఫీదునిస్తారు. కోర్సులో భాగంగా ఖైదీలకు ఆధ్యాత్మిక పాఠాలు బోధిస్తారు. ఈ ఆలోచన జైలు సూపరింటిండెంట్ ఉషా రాజేది. ఆమె ఎంతో చొరవ తీసుకుని గాయత్రి వేద పండితుల సాయంతో ఖైదీలను ఆధ్యాత్మికత, పౌరోహిత్యం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటిదాకా 100 మంది వరకు ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ ఇవ్వడం విశేషం.