Nara Lokesh: మ‌ట్టిదొంగ‌ల్ని వ‌దిలేసి.. పోరాడే ధూళిపాళ్ల‌ని అరెస్ట్ చేస్తారా?: నారా లోకేశ్

Nara Lokesh condemns arrest of Dhulipala Narendra Kumar
  • రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న లోకేశ్ 
  • జగన్ కు ఇదే చివరి ఛాన్స్ అని తేలిపోవడంతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణ 
  • ధూళిపాళ్ల అరెస్ట్ అరాచక పాలనకు అద్దం పడుతోందని వ్యాఖ్య 
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మట్టి దొంగలను వదిలేసి... పోరాడే ధూళిపాళ్లను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. 

జగన్ రెడ్డికి ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్రజా ప్రతినిధులు అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన మట్టి, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతోందని అన్నారు. అక్రమార్కులకు అండగా నిలిచిన పోలీసులు... దోపిడీని ప్రశ్నించిన ధూళిపాళ్ల నరేంద్రని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోందని చెప్పారు. మట్టి మాఫియాపై పోరాడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టుని ఖండిస్తున్నానని తెలిపారు.
Nara Lokesh
Dhulipala Narendra Kumar
Telugudesam
Jagan
YSRCP

More Telugu News