అసదుద్దీన్ అనుచరులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నారు... ఇవి మీకు పట్టవా కేటీఆర్?: ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్
- ట్విట్టర్లో వీడియోను షేర్ చేసిన విష్ణు
- ఎందుకు చర్యలు తీసుకోరని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న
- దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
ఇందులో ఓ భవనం ముందు కొంతమంది 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తున్నారు. వీరంతా ఓవైసీ అనుచరులని విష్ణువర్థన్ పేర్కొన్నారు. ఇలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాతీయవాదం గురించి ప్రతి ఒక్కరికీ పాఠాలు చెబుతారు. కానీ ఇలాంటి వీడియోలు కనిపించినప్పుడు మాత్రం తమ దుర్మార్గపు రాజకీయాలను కొనసాగించడానికి వెంటనే దాక్కుంటారు’ అని ట్వీట్ చేశారు.