Tollywood: కూతురు హీరోయిన్.. విష్వక్సేన్​ హీరో.. యాక్షన్ కింగ్​ అర్జున్ డైరెక్షన్లో సినిమా

Vishwak Sen new movie will be written  Directed and Produced by Action King Arjun
  • కథ అందించి నిర్మించనున్న అర్జున్
  • టాలీవుడ్ కు పరిచయం కానున్న ఐశ్వర్య అర్జున్
  • జగపతిబాబుకు కీలక పాత్ర 
టాలీవుడ్ లో ఓ ఆసక్తికర కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోంది. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు  విష్వక్సేన్ ను కన్నడ సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ గా తెలుగులోనూ ఎంతో ఆదరణ పొందిన అర్జున్ డైరెక్ట్ చేయబోతున్నాడు. కథా రచయిత, నిర్మాత కూడా అతనే. ఇందులో అర్జున్ కూతురు ఐశర్య హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. 

    ‘అశోక వనంలో అర్జున కల్యాణం’తో ఈ మధ్య మంచి హిట్ అందుకున్న విష్వక్ ప్రస్తుతం ‘దాస్‌ కా ధమ్కీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అర్జున్ తో సినిమాకు పచ్చజెండా ఊపాడు. యాక్షన్‌ హీరోగా పేరున్న అర్జున్.. ఇతర హీరోల సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడిగా కూడా అతనికి అనుభవం ఉంది. ఇప్పటికే పదికి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన అర్జున్ తాజా చిత్రంతో మరోసారి మెగాఫోన్ పడుతున్నాడు. 

ఈ చిత్రంతో తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు. అర్జున్ స్నేహితుడైన సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Tollywood
Vishwak Sen
new moview
Action King Arjun
aiswarya arjun
jagapati babu

More Telugu News