Anand Mahindra: అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయి: ఆనంద్ మహీంద్రా

Agniveers will get employment in corporate sector says Anand Mahindra
  • అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందన్న ఆనంద్ మహీంద్రా 
  • అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని హామీ 
  • ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని వ్యాఖ్య 
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ పథకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని చెప్పారు.
Anand Mahindra
Agnipath Scheme

More Telugu News