Rain: బెంగళూరులో వర్షం... టీమిండియా, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ కు అంతరాయం

Team India and South Africa match delayed due to rain in Bengaluru
  • మ్యాచ్ 19 ఓవర్లకు కుదింపు
  • 7.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు
  • మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా మైదానంలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. పిచ్ పై కవర్లను కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం నిలిచిపోవడంతో మైదానాన్ని ఆటకు అనువుగా చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ 7.50 గంటలకు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఒక్కో జట్టు 19 ఓవర్లు ఆడుతుందని వెల్లడించారు. 

కాగా, ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. దాంతో అందరి దృష్టి బెంగళూరు మ్యాచ్ పై నెలకొంది. అయితే వరుణుడు అడ్డంకిగా మారడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
Rain
Bengaluru
5th T20
Team India
South Africa

More Telugu News