విరాటప‌ర్వంపై వీహెచ్‌పీ పోలీస్ కంప్లైంట్‌

  • రెండు రోజుల క్రితం విడుద‌లైన విరాట‌ప‌ర్వం
  • యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించేలా సినిమా ఉంద‌న్న వీహెచ్‌పీ
  • ఈ త‌ర‌హా సినిమాల‌కు అనుమ‌తుల‌పై అభ్యంత‌రం తెలిపిన అజ‌య్ రాజ్‌
  • సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన వైనం
  • సెన్సార్ బోర్డుపై చ‌ర్యలు తీసుకోవాలంటూ విన‌తి
vhp leader lodge a complaint on virataparvam movie in sultan bazar police station

టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెర‌కెక్కి రెండు రోజుల క్రితం విడుద‌లైన విరాటప‌ర్వం సినిమాపై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. విశ్వ హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ)కి చెందిన అజ‌య్ రాజ్ హైద‌రాబాద్‌లోని సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. ఈ సినిమాకు అనుమ‌తి ఇచ్చిన సెన్సార్ బోర్డుపై చ‌ర్యలు తీసుకోవాలంటూ ఆయ‌న త‌న ఫిర్యాదులో పోలీసుల‌ను కోరారు.

న‌క్స‌లిజం, ఉగ్ర‌వాదాల‌ను ప్రేరేపించేలా విరాటప‌ర్వం సినిమా ఉంద‌ని అజ‌య్ రాజ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సినిమాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించేలా ఈ సినిమా ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. అజయ్ రాజ్ నుంచి ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు దానిపై ఏ త‌ర‌హాలో ముందుకెళ్లాలన్న విష‌యంపై ఆలోచ‌న చేస్తున్నారు.

More Telugu News