టీడీపీ నేత అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మునిసిపల్ సిబ్బంది.. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
- తెల్లవారుజామున జేసీబీతో కూల్చేసిన మునిసిపల్ అధికారులు
- ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారంటూ నోటీసులు
- ఎప్పుడో జారీ చేసిన నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ వెంటనే కూల్చివేత
- అయ్యన్న ఇంటికి వెళ్లే దారుల మూసివేత
పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉన్న ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ వెంటనే గోడను కూలగొట్టడం ఏంటని అయ్యన్న కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. గోడ కూల్చివేత, పోలీసుల మోహరింపుతో నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.