Pawan Kalyan: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదిగో!

Pawan Kalyan will tour in old prakasam district
  • ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
  • కౌలురైతు భరోసా యాత్ర చేపడుతున్న పవన్
  • ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
  • రేపు పర్చూరులో సభ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. కౌలు రైతు భరోసా యాత్ర పేరిట ఇప్పటికే పలు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించి, కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఈ క్రమంలో, జనసేనాని రేపు ఆదివారం (జూన్ 19) ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పవన్ పర్యటన వివరాలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది. 

గుంటూరు జిల్లా మీదుగా పర్చూరు చేరుకుంటారని, పర్చూరులో సభ ఉంటుందని తెలిపింది. పవన్ కల్యాణ్ రేపు ఉదయం 11 గంటలకు ఏటుకూరు చేరుకుంటారు. 11.30 గంటలకు చిలకలూరిపేట చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాలెం జంక్షన్ లో ప్రవేశిస్తారు. 

అక్కడి నుంచి డేగర్లమూడి, చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి, పెదజాగర్లమూడి మీదుగా పర్చూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పర్చూరు ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో జనసేన రైతు భరోసా యాత్ర సభలో పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News