Secunderabad: సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్నవారిలో 450 మంది అక్కడి నుంచి వచ్చినవారే!

22 arrested in Secunderabad violence
  • గుంటూరు రైల్లో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది వచ్చినట్టు గుర్తించిన పోలీసులు
  • ఇప్పటి వరకు 22 మంది ఆందోళనకారుల అరెస్ట్
  • గుంటూరు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆందోళనకారులు

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి. ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు. గాయపడిన మరో 14 మందిని నిన్న గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


మరోవైపు సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన రైల్లో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గుంటూరుతో పాటు కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ కు చెందిన అభ్యర్థులు వచ్చినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News