rahul Gandhi: క్షమాపణ చెప్పి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోండి: రాహుల్ గాంధీ

Rahul Gandhi demands to withdrwa Agnipath Scheme
  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని చెప్పానన్న రాహుల్ 
  • రైతుల నిరసనల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్య  
  • ఇప్పుడు అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం వివాదాస్పదంగా మారింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ... రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ఇదే విధంగా సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోక తప్పదని అన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పానని... చివరకు తాను చెప్పిందే జరిగిందని తెలిపారు. ఇప్పుడు కూడా యువతకు క్షమాపణలు చెప్పి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News