Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో ‘లగాన్’ టీమ్ సందడి

Aamir Khan hosts Lagaan reunion at his home as film completes 21 years
  • 21 ఏళ్లు పూర్తి చేసుకున్న విలక్షణ సినిమా
  • ఈ సందర్భంగా ఆమిర్ నివాసంలో గెట్ టూ గెదర్
  • పాల్గొన్న చిత్ర ప్రముఖులు, మాజీ క్రికెటర్లు
బ్లాక్ బస్టర్ మూవీ లగాన్ గుర్తుండే ఉంటుంది. క్రికెట్ నేపథ్యంతో నడిచే ఈ సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందానికి ఆమిర్ ఖాన్ తన నివాసంలో ప్రత్యేక ఆతిథ్యాన్ని ఇచ్చారు. బుధవారం ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసం ‘ఈ గెట్ టూ గెదర్’కు వేదికగా నిలిచింది. ఆ రోజంతా వారు ఆమిర్ నివాసంలో సందడి చేశారు. ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమిర్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘లగాన్ కు 21 ఏళ్లు’ అని క్యాప్షన్ పెట్టింది. 

ఆమిర్ ఖాన్, అశుతోష్ గోవర్కర్, యశ్పాల్ శర్మ, అఖిలేంద్ర మిశ్రా, రాజేంద్రనాథ్ జుట్షి ఇతరులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వీడియోలో చూడొచ్చు. మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. శంకర్ పాండే, రాజా అవస్థి, సుహాసిని మూలే, ప్రదీప్ రామ్ సింగ్ రావత్, అమీన్ గాజి సైతం హాజరయ్యారు. (వీడియో కోసం)
Aamir Khan
Lagaan
movie
21 years
get to gether

More Telugu News