Nani: 'అంటే .. సుందరానికీ' ఫస్టువీక్ వసూళ్లు ఇవే!

  • నాని తాజా చిత్రంగా వచ్చిన 'అంటే .. సుందరానికీ'
  • కులాంతర ప్రేమ - పెళ్లి చుట్టూ తిరిగే కథ 
  • తెలుగు రాష్ట్రాల్లో ఫస్టువీక్ వసూళ్లు 12.05 కోట్ల షేర్
  • ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన వసూళ్లు 18.39 కోట్ల షేర్  
Ante Sundaraniki movie update

నాని - నజ్రియా జంటగా రూపొందిన 'అంటే సుందరానికీ' సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. కులాలు వేరైన ఇద్దరు యువతీ యువకులు .. తమ ప్రేమకి పెద్దల ఆమోదాన్ని సంపాదించడానికి పడే పాట్లే ఈ కథ. 

నాని - వివేక్ ఆత్రేయ ఇద్దరూ హిట్స్ తో ఉన్నారు. ఇక తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నజ్రియాను ఈ సినిమాతో ఇక్కడికి తీసుకుని వచ్చారు. టైటిల్ తో పాటు టీజర్ లకు .. ట్రైలర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. హిట్ కీ .. ఫ్లాప్ కి మధ్యలో ఆగిపోయింది. 


 ఫస్టు వీక్ లో ఈ సినిమా వసూళ్ల వివరాలు బయటికి వచ్చాయి. తొలి వారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 5.58 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో 12:05 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 32.60 కోట్ల గ్రాస్ ను .. 18.39 కోట్ల షేర్ ను రాబట్టిందని చెబుతున్నారు.

More Telugu News