Narendra Modi: నేడు 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ మాతృమూర్తి.. తల్లికి పాదపూజ చేసిన మోదీ.. ఫొటోలు ఇవిగో!

Modi takes blessings of his mother on her 100th birthday
  • తల్లి ఆశీస్సులు తీసుకున్న మోదీ
  • చిన్న కొడుకు వద్ద ఉంటున్న మోదీ తల్లి
  • వందేళ్ల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్న హీరాబెన్
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ నూరవ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తల్లిని మోదీ కలిశారు. ఈ ఉదయం గాంధీనగర్ లోని తన తల్లి నివాసానికి ఆయన వెళ్లారు. తన తల్లికి పాదపూజ చేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెకు స్వీట్ తినిపించారు.  ప్రస్తుతం మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను ఆయన సందర్శించనున్నారు.   

మరోవైపు వందేళ్ల వయసులో కూడా హీరాబెన్ మోదీ ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నారు. ఈ వయసులో కూడా ఆమె అనారోగ్యానికి గురయినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు. తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఆమె ఉంటున్నారు. హీరాబెన్ కు చిన్న మొత్తంలో సాత్వికాహారం తీసుకోవడం అలవాటు. ఆమె ఆరోగ్యానికి అదే కారణం కావచ్చని అంటుంటారు. ఎక్కువ మసాలా, నూనె ఉన్న ఆహారాన్ని ఆమె తీసుకోరు. అన్నం, కిచిడి, చపాతి, పప్పు వంటివి ఆమె ఆహారంలో ఉంటాయి. స్వీట్స్ విషయానికి వస్తే షుగర్ క్యాండీని ఆమె ఇష్టపడతారు. 
Narendra Modi
Mother
Heeraben Modi
100th Birthday

More Telugu News