చమురు చెల్లింపులకు డాలర్లు లేవు... శ్రీలంకలో స్కూళ్లు, ఆఫీసులు మూసివేత

  • శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం
  • అడుగంటిన విదేశీ మారకద్రవ్యం
  • విదేశీ చమురు అందే మార్గం లేక లంక విలవిల
  • మూలనపడిన ప్రభుత్వ వాహనాలు
Schools and offices to shutdown in Sri Lanka

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. తాజాగా, దేశంలోని స్కూళ్లను, ఆఫీసులను మరో రెండు వారాల పాటు మూసివేయాలని నిర్ణయించారు. అందుకు కారణం... ఇంధన కొరత. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది.  విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు, ఇప్పటికే కొనుగోలు చేసిన చమురుకు చెల్లింపులు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం వద్ద అవసరమైన విదేశీ మారకద్రవ్యం లేదు. 

ఈ నేపథ్యంలో, శ్రీలంక ప్రజాపాలన మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అతి తక్కువ సిబ్బందితో ప్రజాపాలనా సంబంధ సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పేర్కొంది. ప్రభుత్వ రవాణా వ్యవస్థలు ఎప్పుడో నిలిచిపోయాయని, కనీసం ప్రైవేటు వాహనాలు కూడా సమకూర్చుకోలేని స్థితి ఏర్పడిందని, దాంతో వివిధ కార్యాలయాలను అతి తక్కువమంది ఉద్యోగులతో నడపాలని నిర్ణయించినట్టు సదరు మంత్రిత్వశాఖ పేర్కొంది.

More Telugu News