Pawan Kalyan: ఇటీవల తన ఇంట్లో కిందపడిపోయిన హరిరామజోగయ్య... ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన పవన్ కల్యాణ్
- హరిరామజోగయ్య కుమారుడ్ని పిలిపించుకున్న పవన్
- జనసేనానిని కలిసిన చేగొండి సూర్యప్రకాశ్
- హరిరామజోగయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కలుస్తానని వెల్లడి
సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఇటీవల తన నివాసంలో కిందపడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ హరిరామజోగయ్య కుమారుడు, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు సూర్యప్రకాశ్ ను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో హరిరామజోగయ్య గారిని కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
హరిరామజోగయ్య గతంలో అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందిన సమయంలోనూ పవన్ కల్యాణ్ ఆయనను పరామర్శించారు.
.
హరిరామజోగయ్య గతంలో అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందిన సమయంలోనూ పవన్ కల్యాణ్ ఆయనను పరామర్శించారు.
.