Damodara Rakesh: సికింద్రాబాద్ కాల్పుల మృతుడు దామోదర రాకేష్ స్వగ్రామంలో విషాద ఛాయలు

Secunderabad firing victim identified as Damodara Rakesh of Warangal district
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హింస
  • అగ్నిపథ్ ను నిరసిస్తూ రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
  • కాల్పులు జరిపిన పోలీసులు
  • మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ గా గుర్తింపు
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ కు నిరసనగా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన యువకుడిని వరంగల్ జిల్లాకు చెందిన దామోదర రాకేష్ గా గుర్తించారు. 

రాకేష్ స్వగ్రామం ఖానాపురం మండంలోని దబీర్ పేట. రాకేష్ తండ్రి కుమారస్వామి వ్యవసాయదారుడు. రాకేష్ కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. అతడి సోదరి సైన్యంలో పనిచేస్తున్నారు. కాగా, రాకేష్ వయసు 18 సంవత్సరాలు. నర్సంపేటలో డిగ్రీ పూర్తిచేశాడు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో రాకేష్ మరణించడంతో అతడి స్వగ్రామం దబీర్ పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువులు, గ్రామస్థులు అతడి ఇంటికి తరలివస్తున్నారు. రాకేష్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Damodara Rakesh
Death
Firing
Secunderabad Railway Station

More Telugu News