Balmuri Venkat: సికింద్రాబాద్ అల్లర్లతో మాకు సంబంధం లేదు: ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్

Congress has any link with Secunderabad violence says Balmuri Venkar
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు
  • పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి
  • ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే పనులు కాంగ్రెస్ చేయదన్న వెంకట్
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచి వేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆర్మీ నియామక పరీక్షలు రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. 

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే పనులను కాంగ్రెస్ పార్టీ చేయదని వెంకట్ తెలిపారు. ఈ ఉదయం తాను ఒక టీవీ ఛానల్ డిబేట్ కు వెళ్తుండగా పోలీసులు తనను అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారని చెప్పారు. అక్కడి నుంచి షా ఇనాయత్ గంజ్ పీఎస్ కు తీసుకొచ్చారని తెలిపారు. అందుకే పోలీస్ స్టేషన్ నుంచే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని చెప్పారు.
Balmuri Venkat
NSUI
Secunderabad

More Telugu News