Agnipath Scheme: తగ్గేదేలేదన్న ఆర్మీ చీఫ్.. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ఉంటుందని ప్రకటన! 

Army recruitment schedule will be soon says Army Chief
  • వయోపరిమితి పెంచామన్న ఆర్మీ చీఫ్
  • యువతకు దేశభక్తి చాటుకునే అవకాశం దొరికిందని వ్యాఖ్య
  • సైన్యంలో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన
త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నపథ్ పథకం దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసను రాజేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైళ్లకు నిప్పుపెడుతున్నారు. సికింద్రాబాద్ లో సైతం ఒక రైలును అగ్నికి ఆహుతి చేశారు. అయినప్పటికీ కేంద్రం కానీ, ఆర్మీ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. 

ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ రోజు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత వయోపరిమితిని ఒక్కసారి పెంచుతున్నామని, రిక్రూట్ మెంట్ ఏజ్ ను 23 ఏళ్లకు పెంచామని చెప్పారు. 

ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని అన్నారు. కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభించిందని చెప్పారు. అగ్నివీరులుగా సైన్యంలో చేరే అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు.
Agnipath Scheme
Army Chief
Recruitment

More Telugu News