సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసంపై రేవంత్ రెడ్డి స్పందన
- ఘటన దురదృష్టకరం అన్న టీపీసీసీ అధ్యక్షుడు
- అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన హింసాత్మకం
- నాలుగు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
- గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు
ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని రేవంత్ ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ లేకపోవడం, ఆర్మీలో లక్షల ఖాళీలు ఉండగా.. ఇప్పుడు కేవలం నాలుగేళ్ల సర్వీసుతో కేవలం వేల మందిని మాత్రమే నియమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. వేలాది మంది యువకులు రైలు పట్టాలపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. దాంతో, సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు.