Harish Rao: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీశ్ రావు దంపతులు!

Harish Rao offers prayers to Tirumala Sri Venkateswara
  • కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న హరీశ్
  • శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న టీఎస్ మంత్రి
  • హరీశ్ దంపతులకు వేదాశీర్వచనం పలికిన ఆలయ అర్చకులు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన... ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Harish Rao
TRS
Tirumala

More Telugu News