సామాన్యులకు ఊరట.. తగ్గిన వంటనూనె ధరలు

  • పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు
  • అంతర్జాతీయ విపణిలో తగ్గిన ఆయిల్ ధరలు
  • పామాయిల్‌పై గరిష్ఠంగా 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ. 15 తగ్గింపు
Edible oil cos set to slash prices

పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఇది కాస్తంత ఊరటనిచ్చే వార్తే. అంతర్జాతీయ విపణిలో నూనె ధరలు తగ్గడంతో దేశీయంగానూ తగ్గుముఖం పట్టాయి. పామాయిల్ ధర లీటరుకు రూ. 7-8 తగ్గగా, సన్‌ఫ్లవర్ నూనె ధర రూ. 10 నుంచి 15 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. 

సోయాబీన్ ఆయిల్ ధర రూ. 5 తగ్గినట్టు భారతీయ వంటనూనెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు దేశాయ్ తెలిపారు. ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను గత వారం రూ. 15-20 తగ్గించినట్టు హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ తెలిపింది. ఈ వారం మరో 20 రూపాయలు తగ్గించనున్నట్టు పేర్కొంది.

More Telugu News