Jagan: ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్న జగన్

Jagan going to Paris
  • ఈ నెలాఖరులో పారిస్ వెళ్లనున్న జగన్
  • పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న జగన్ పెద్ద కూతురు
  • కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. మొన్న దావోస్ కు వెళ్లింది అధికారిక పర్యటన అయితే... ఇప్పుడు ఫ్రాన్స్ కు వెళ్తున్నది వ్యక్తిగత పర్యటన. జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్ లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఆమె చదువుతున్నారు. వచ్చే నెల 2న బిజినెస్ స్కూల్లో కాన్వొకేషన్ కార్యక్రమం జరగనుంది. తన కూతురు కాన్వొకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
Jagan
France
Paris

More Telugu News