Mahesh Babu: ఇటలీలో మహేశ్ బాబు కుటుంబం సందడి

Mahesh Babu making memories with wife Namrata Shirodkar and kids in Italy
  • కుటుంబమంతా కలసి సెల్ఫీ షూట్
  • నవ్వులు చిందిస్తూ ఫొటోలు
  • వాటిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన మహేశ్ బాబు
  • జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నామని క్యాప్షన్
ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు కుటుంబ సమేతంగా యూరోప్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే స్విట్జర్లాండ్ లోని అందాలను చుట్టేసిన ఈ కుటుంబం అక్కడి నుంచి ఇటలీకి చేరుకుంది. భార్య నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలసిన ఫొటోలను మహేశ్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. సెల్ఫీలో ముందు నమ్రత, సితార ఉంటే, వెనుక మహేశ్, గౌతమ్ నవ్వులు చిందిస్తున్నారు.

‘ఇక్కడ ఇప్పుడు.. జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నాం’’ అని మహేశ్ బాబు క్యాప్షన్ తగిలించారు. మహేశ్ షేర్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఇటలీకి ముందు వీరంతా స్విట్జర్లాండ్ లోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. స్విట్జర్లాండ్ పర్యటన ఫొటోలను నమ్రత ఇప్పటికే షేర్ చేయడం తెలిసిందే. ఇక స్విట్జర్లాండ్ కంటే ముందు వీరు జర్మనీలోనూ పర్యటించారు. సితార స్కూటర్ తో పోజు ఇచ్చే ఫొటోను వారు అభిమానులతో పంచుకున్నారు.
Mahesh Babu
Namrata Shirodkar
Italy
europe trip

More Telugu News