Russia: నిలబడలేక ఇబ్బంది పడుతూ వణుకుతున్న పుతిన్.. రష్యా అధ్యక్షుడికి అసలు ఏమైంది?

Video emerges of Russian President Vladimir Putins legs shaking
  • క్రెమ్లిన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పుతిన్
  • అంతర్జాతీయ మీడియాలోనూ ఆయన అనారోగ్యంపై వార్తలు
  • బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారన్న రష్యా సంపన్నుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడడం లేదు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, బ్లడ్ క్యాన్సర్ కారణంగా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఊహాగానాలు నిజమేననిపించేలా మరో వీడియో బయటకు వచ్చింది. క్రెమ్లిన్‌లో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ నిలబడడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. పోడియం వద్ద నిల్చున్న పుతిన్ వణుకుతుండడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా  కనిపిస్తోంది. దీంతో ఆయన అనారోగ్యం బారినపడడం నిజమేనని కొందరు నిర్ధారించేస్తున్నారు.

అంతర్జాతీయ మీడియాలోనూ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కాగా, పుతిన్ ఆరోగ్యంపై రష్యాకు చెందిన ఓ సంపన్న వ్యక్తి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు గతంలోనే వెల్లడించారు. చికిత్సలో భాగంగా ఆయన వెన్నెముకకు శస్త్రచికిత్స కూడా జరిగినట్టు చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడానికి ముందే ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని చెబుతున్నారు.
Russia
Vladimir Putin
Blood Cancer
Viral Videos

More Telugu News