Andhra Pradesh: ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వం

  • ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ క‌మిష‌నర్‌గా ఏబీవీ
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
  • టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ
  • నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాలంటూ ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్‌
  • సుప్రీంకోర్టును ఆశ్రయించి విజ‌యం సాధించిన ఐపీఎస్‌
ab venkateswara rao appointed as printing and stationery commissioner

ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏపీ ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా ఆయ‌న‌ను నియ‌మిస్తూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీడీపీ హ‌యాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఏబీవీని నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్దారన్న ఆరోప‌ణ‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సివిల్ స‌ర్వీసెస్ అధికారుల‌ను రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్‌లో ఉంచ‌రాద‌న్న నిబంధ‌న‌ను ప్ర‌స్తావించిన సుప్రీంకోర్టు త‌క్ష‌ణ‌మే ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇటీవ‌లే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కే ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

More Telugu News