G Jagadish Reddy: కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేయడానికి కారణం ఇదే: రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి

This is the reason for KCR to think about national party says Jagadish Reddy
  • దేశాన్ని నడిపించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయన్న మంత్రి 
  • అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని వెల్లడి 
  • దేశ రూపురేఖలు మార్చే అజెండాతో కేసీఆర్ రాబోతున్నారన్న జగదీశ్ రెడ్డి 
దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దేశ భవిష్యత్తుకు సరైన పునాదులు వేయలేకపోయాయని అన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. 

దేశాన్ని మధ్యరాతి యుగం వైపు బీజేపీ తీసుకెళ్తున్నా... కాంగ్రెస్ పార్టీ సరైన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతోందని అన్నారు. అందుకే ప్రత్యామ్నాయ అజెండాను తీసుకొచ్చే శక్తుల కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. దేశ రూపు రేఖలు మార్చే కొత్త అజెండాతో కేసీఆర్ రాబోతున్నారని అన్నారు. కేసీఆర్ అజెండా నచ్చితే దేశ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పారు.
G Jagadish Reddy
KCR
TRS
National Party

More Telugu News